ఆబిడ్స్‌లో కుప్పకూలిన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం

V. Sai Krishna Reddy
0 Min Read

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో పెను ప్రమాదం తప్పింది. ఓ భారీ భవన నిర్మాణంలో వినియోగిస్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు ధ్వంసం కావడంతో భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *