అనుమానస్పద స్థితిలో తల్లి,కూతురు మృతి
మత్తులో అపస్మారక స్థితిలో పెద్దకుమార్తె
మిర్యాలగూడ,ఏప్రిల్ 12, ( ప్రజాజ్యోతి ):
అనుమానస్పద స్థితిలో లో తల్లి, చిన్న కూతురు మృతి చెందగా, పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో ఉన్న సంఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డులో చోటుచేసుకుంది. స్థానికులు, తెలిసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పలనాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం కు చెందిన గుర్రం సీతారాం రెడ్డి, రాజేశ్వరి(రాజీ )(33)లు దంపతులు. ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న సీతారాం రెడ్డి గత కొంతకాలంగామిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.కాగా గత రెండు రోజులుగా భర్త సీతారాం రెడ్డి వేరే ఊరికి వెళ్ళాడని సమాచారం. శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను ఇంట్లో పరిశీలించగా భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరివేసుకొని మృతి చెంది ఉండగా, ఆమె చేతి మణికట్టు కూడా కోసి ఉన్నట్లు గుర్తించారు. మరొకదిలో చిన్న కుమార్తె వేదశ్రీ (13) గొంతు కోసిన గాయాలతో చనిపోయి ఉంది. మరో గదిలో 9వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉంది గమనించిన సీతారాం రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మిర్యాలగూడ డి.ఎస్.పి కె రాజశేఖర్ రాజు,పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని మృతికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. పెద్ద కుమార్తె మత్తు వీడితేనే ఈ మృతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.