ఇన్‌స్టాగ్రామ్ సవరించిన మార్పులు ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలంటే ముందుగా పిల్లల పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది. వారి అనుమతి లేనిదే లైవ్ ఆప్షన్ వాడుకోవడానికి వీలు లేదు. డైరెక్ట్ మెసేజ్‌లలో న్యూడిటీ ఉన్న కంటెంట్ కూడా తల్లిదండ్రుల అనుమతి లేకుండా 16 ఏళ్ల పిల్లలకు కనిపించదు. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తే తప్ప 16 ఏళ్లలోపు టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను వాడుకోలేరు. డైరెక్ట్ మెసేజ్‌ల్లో “న్యూడిటీ ఉన్న చిత్రాలు బ్లర్ అవుతాయి. దాన్ని చూసేందుకు ట్రై చేసినా వీలు కాదు. ఆ ఆఫ్షన్ ఆఫ్ చేయడానికి లేదు” దీనికి కూడా తల్లిదండ్రుల అనుమతి అవసరం అని మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. 16 ఏళ్లలోపు వినియోగదారులకు భద్రతా చర్యలను ఫేస్‌బుక్, మెసెంజర్‌లకు విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియా కంపెనీ వెల్లడించింది. సోషల్ మీడియా యువకుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పర్యవేక్షిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరిన్ని ఆప్షన్‌లను అందించడానికి మెటా సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్ కోసం తన టీనేజ్ అకౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
టీనేజర్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇప్పటికే ఉన్న రక్షణలు ఉంటాయి. వీటిలో టీనేజర్ల ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ చేయడం, అపరిచితుల నుండి ప్రైవేట్ సందేశాలను బ్లాక్ చేయడం, ఫైట్ వీడియోలు వంటి సున్నితమైన కంటెంట్‌పై కఠినమైన పరిమితులు, 60 నిమిషాల తర్వాత యాప్ నుండి నిష్క్రమించడానికి రిమైండర్‌లు, నిద్రవేళల్లో నిలిపివేయబడిన నోటిఫికేషన్‌లు ఉన్నాయి. “ఫేస్‌బుక్, మెసెంజర్‌లోని టీనేజర్ ఖాతాలు అనుచితమైన కంటెంట్, అవాంఛిత పరిచయాన్ని పరిమితం చేయడానికి ఇలాంటి, ఆటోమేటిక్ రక్షణలను అందిస్తాయి. అలాగే టీనేజర్ల సమయం బాగా గడిపేలా చూసుకోవడానికి మార్గాలు ఉంటాయి” అని మెటా తెలిపింది.