సంగెం (గీసుగొండ)మార్చి25(ప్రజాజ్యోతి):
మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హుండీ లెక్కింపు ప్రారంభమైంది.గత సంవత్సరం 2024లో కొమ్మాల జాతర ఆదాయం రూ.26 లక్షల చిల్లర పై చిలుకు వచ్చింది. ఈసారి 2025 కు గాను రూ.50 లక్షల పై గానే వచ్చే అవకాశం ఉంది.ఈ ఏడాది దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు,ప్రధాన అర్చకులు రామాచార్యులు తెలిపారు. లెక్కింపులో ఆలయ చైర్మన్ కడారి రాజు యాదవ్,నాయకులు చాడా కొమురారెడ్డి,సాయిలి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.