వినియోగదారులను ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా కంపెనీలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సరికొత్త మోడళ్లు తీసుకువస్తూ భారత్ లో మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి కంపెనీలతో పోకో ఒకటి. ఇది షావోమీ అనుబంధ సంస్థ. తాజాగా పోకో నుంచి నయా 5జీ ఫోన్ రిలీజైంది. తాజా మోడల్ ను తన ఎం సిరీస్ లో భాగంగా ఎం7 5జీ పేరిట మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్ కార్ట్ లో మార్చి 7 నుంచి విక్రయాలు జరుగుతాయి.
స్పెక్స్ అండ్ ఫీచర్స్…
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ సాయంతో పనిచేస్తుంది.
దీంట్లో 6.88 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంది.
ఇది రెండు వేరియంట్లలో వస్తోంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి ఒక వేరియంట్ కాగా… 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి మరో వేరియంట్.
ఓషన్ బ్లూ, మింట్ గ్రీన్, శాటిన్ బ్లాక్ కలర్స్ లో లభ్యమవుతుంది.
ఇది 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.
ఇందులో బ్లూటూత్ వెర్షన్ 5.0 ఇచ్చారు.
50 ఎంపీ రియర్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్)+ మరో కెమెరా… 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
3.5 ఎంఎం యూనివర్సల్ ఆడియో జాక్, టైప్-సీ యూఎస్ బీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు.
5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.
ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ పొందుపరిచారు.
ఇందులో 6 జీబీ వెర్షన్ ధర రూ.9999 కాగా… 8 జీబీ వెర్షన్ ధర రూ.10,999.