దామెర, మార్చి 2 (ప్రజాజ్యోతి)
దామెర మండల కేంద్రంలో ”రెడిన్ కలర్ ల్యాబ్” వారి ఆధ్వర్యంలో నిర్మించిన రెడిన్ హోటల్ అండ్ రిసార్ట్ ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం దామెర మండల కేంద్రంలో రెడిన్ కలర్ ల్యాబ్ అధినేత గాదె లింగమూర్తి నెలకొల్పిన ఫ్యామిలీ రిసార్ట్ అండ్ హోటల్ ఎమ్మెల్యే ప్రారంభించారు. పచ్చని పంట పొలాల మధ్య స్వచ్చ మైన వాతావరణంలో రిసార్ట్ నిర్మించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు అనువుగా బర్త్ డే ఫంక్షన్స్, పెళ్లి రోజు కార్యక్రమాలు, వివిధ ఫంక్షన్స్ చేసుకునేందుకు అనువుగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, రెడిన్ కలర్ ల్యాబ్ అధినేత గాదె లింగమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు బీరం సుధాకర్ రెడ్డి, బిల్లా రమణారెడ్డి, జక్కుల రవీందర్, గంగిడి శ్రీధర్ రెడ్డి, పోల్సాని అనిల్ రెడ్డి, సదిరం పోచయ్య, దురిశెట్టి బిక్షపతి, దామెర శంకర్, దాసమల్ల కిరణ్, దామెర రమేష్, దామెర ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామెర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.