రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం స్కూళ్లకు రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. నెలవంక కనిపించడంతో రేపటి నుంచి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.