పర్వతగిరి, ఫిబ్రవరి 23 (ప్రజాజ్యోతి)
శనివారం రోజున సాయంత్రం మూడు గంటల సమయంలో వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ ,ఈస్ట్ జోన్ డిసిపి పి. రవీందర్, మామునూర్ ఎసిపి బి. తిరుపతి సూచనల మేరకు చింత నెక్కొండ సమీపంలో గల వైన్ షాప్ వద్ద పర్వతగిరి ఎస్ ఐ బి ప్రవీణ్ పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ చేయుచుండగా ఒక ఆడ మనిషి పేరు సంజీల షేక్, 22 సంవత్సరాలు ఒక మగ వ్యక్తి రోహిత్ షేక్ వయసు 27 సంవత్సరాలు, మూడు లగేజ్ బ్యాగులతో ఢిల్లీకి చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగులలో 27 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. వెంటనే దానిని సీజ్ చేసి అట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిద్దరు సొంత అన్నా చెల్లెలు ఢిల్లీకి చెందిన వీరు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి వెళ్లి అక్కడ గంజాయి కొనుక్కొని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో పట్టుకోవడం జరిగింది. ఆదివారం రోజు పర్వతగిరి సీఐ బి రాజగోపాల్ వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేయడం జరిగింది. గత ఆరు నెలల నుండి మీరు ఈ పని చేస్తున్నట్టుగా విచారణలో చెప్పినారు. సిఐ రాజగోపాల్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి ఎస్సై ప్రవీణ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.