సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులు సెల్ ఫోన్లు వెంట తీసుకురావద్దనే కండిషన్ పెట్టారు. ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వూలో రకుల్ స్పందించారు.
పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తాయనే భయంతో ఫోన్లను నిరాకరించామనే ప్రచారం జరిగిందని… అందులో వాస్తవం లేదని రకుల్ స్పష్టం చేశారు. వివాహ వేడుకను సింపుల్ గా జరపాలనుకున్నామని… అందుకే కొంతమంది సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించామని చెప్పారు. పెళ్లికి సంబంధించిన మధుర క్షణాలను అతిథులు కూడా ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ‘నో ఫోన్’ కండిషన్ పెట్టామని తెలిపారు. తన దృష్టిలో విలాసం కంటే సౌకర్యమే ముఖ్యమని అన్నారు. పెళ్లి తర్వాత ఫొటోలను తామే మీడియాకు విడుదల చేశామని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే… రకుల్ తాజా చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ ఈ నెల 21వ విడుదల కానుంది