భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు కూడా భారీగానే వసూలు చేస్తోందని, కాబట్టి దానికి (భారత్) ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని నొక్కి చెప్పారు.
భారత్‌కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దే బోల్డంత డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కలిగిన దేశం అదే. వారి టారిఫ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ అన్నా, దాని ప్రధాని అన్నా నాకు చాలా గౌరవం. అయితే, ఓటింగ్‌ను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం మాత్రం..’’ అని ట్రంప్ పేర్కొన్నారు