ఈ వేసవిలో మాంచి క్రికెట్ విందు అందించేందుకు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నయా సీజన్ వస్తోంది. ఐపీఎల్-2025 షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.
ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ మెగా టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్2025లో మే 18తో లీగ్ దశ ముగియనుండగా…. మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్, మే 23న క్వాలిఫయర్-2, మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.