తండ్రికి మద్దతుగా కూతురి ప్రచారం
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి( బిజెపి) అంజిరెడ్డి కి మద్దతుగా ఆయన కూతురు అశ్విత ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అడ్వకేట్స్, మేధావులు విద్యావంతులను కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె వెంట బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, రాకేష్, నవీన్, శశి తదితర యువకులు పాల్గొన్నారు