తీన్మార్ మల్లన్నపై వేటు?
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.