దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ (SSMB 29) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ (SSMB 29) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లలో చాలా సీక్రెట్ గా మూవీ పూజా కార్యక్రమాలు జరగ్గా.. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించినట్లు ఇన్ డైరెక్ట్ గా రాజమౌళి ఓ వీడియో ద్వారా తెలిపారు
సింహాన్ని బంధించి.. చేతిలో పాస్ట్ పోర్ట్ పట్టుకున్న వీడియోను షేర్ చేసిన జక్కన్న.. సినిమా కంప్లీట్ అయ్యేవరకు మహేష్ ను లాక్ చేసినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. అయితే ఆ వీడియోకు మహేష్.. తాను ఒకసారి కమిట్ అయితే తన మాట తానే వినని కామెంట్ పెట్టారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ చేశారు.