బడ్జెట్ ముందు హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..?
మొదట్లో ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లోనే బడ్జెట్ ప్రతులను ముద్రించేvవారు.. కానీ, 1950లో బడ్జెట్ లోని అధిక భాగం లీక్ కావడంతో బడ్జెట్ ముద్రణను మింటో రోడ్ లోని ప్రభుత్వ ప్రెస్కు మార్చారు. అక్కడి నుంచి తిరిగి 1980లో నార్త్ బ్లాక్ బేస్మెంట్కు మార్చారు. దాని తరువాత లాక్ ఇన్ వ్యవధిని కూడా ప్రవేశ పెట్టారు. ఏ చిన్న సమాచారం బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో పాటు, బడ్జెట్ ముద్రణ పనిలో ఉన్న సిబ్బందికి తీపి తినిపించాలనే హల్వా చేయడం ఆచారంగా వస్తోంది..