కామారెడ్డి ఎమ్మెల్యే నివాసంపై దాడి.. తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణా రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తతలు, ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్టు తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.

ప్రశ్నిస్తే దాడులు చేయడమేమిటని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఇంటిపైనే దాడులు చేయడం అమానుషమని అన్నారు. ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. బాన్సువాడలో రాళ్లదాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మజ్లిస్ పార్టీని కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *