ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే… 10 స్థానాల్లో భారీ విజయం……

Kamareddy
1 Min Read
Workers of the Indian National Congress (INC) party wave their flag during a roadshow of their candidate Gurjeet Singh Aujla (not pictured) in Amritsar on May 13, 2024 amid the country's ongoing general election. (Photo by Narinder NANU / AFP) (Photo by NARINDER NANU/AFP via Getty Images)

నాగిరెడ్డిపేట్(ఎల్లారెడ్డి),ఫిబ్రవరి13(ప్రజాజ్యోతి):

ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 10 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని తమ సొంతం చేసుకుంది.ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయభేరి మోగించి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను నిలబెట్టింది.
************************************************
ఎల్లారెడ్డి మున్సిపాటిలో గెలిచినా అభ్యర్థుల వీరే
*************************************************
ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి తుమ్మల (కాంగ్రెస్) రెండో వార్డు.. మంచిర్యాల మహేశ్వరి (కాంగ్రెస్), మూడో వార్డు కౌసర్ ఉన్నిసా (కాంగ్రెస్ ), నాలుగో వార్డు.. దుంపల మంజుల (కాంగ్రెస్), ఐదవ వార్డు అట్కారి చంద్రయ్య (కాంగ్రెస్), ఆరవ వార్డు.. సయ్యద్ గఫర్ (కాంగ్రెస్), ఏడవ వార్డు.. భాగ్యవతి మాత్తమల (కాంగ్రెస్), ఎనిమిదవ వార్డు.. సిద్ది శ్రీధర్ (స్వతంత్ర అభ్యర్థి), తొమ్మిదవ వార్డు.. గాజే తిరుపతి( కాంగ్రెస్ ), పదో వార్డు.. పద్మ శ్రీకాంత్ (కాంగ్రెస్) ,11వ వార్డు లక్ష్మీ రామగల్ల (బిఆర్ఎస్),12వ వార్డు ఎరుకల దశరథం (కాంగ్రెస్) తదితరులు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలతో ఆనందం వెల్లివిరిసింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని భారీ టపాసులు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *