వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
రామారెడ్డి ఫిబ్రవరి 12 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గ్రామంలో వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం మృతి చెందిన బాధిత కుటుంబం ముసలిగల్ల లింగం కుటుంబానికి 25 కిలోల బియ్యం,3000/- రూపాయిల ఆర్థిక సహాయం, నిత్య అవసర సరుకులు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వివేకానంద ట్రస్ట్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ట్రస్ట్ ప్రారంభం అయినపట్టి నుండి ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ చాలా మంది యువతకి ఈ ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తుంది. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడం జరుగుతుందని వివేకానంద ట్రస్టు సభ్యులు తెలిపారు.
