బడ్జెట్ ఎఫెక్ట్: ఆదివారం పనిచేస్తున్న స్టాక్ మార్కెట్.. ఫ్లాట్‌గా సూచీలు

V. Sai Krishna Reddy
1 Min Read

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌‍లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం అతి స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌లు ఆ తర్వాత అతి స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం గం.10.50 సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి.

వివిధ రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తారన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి. మెటల్ రంగం మాత్రం 4.4 శాతం మేర క్షీణించింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లు పని చేస్తున్నాయి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *