వెల్దుర్తి మండలం మెల్లూర్ గ్రామంలో గ్రామసభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో సానుకూల మార్పు తీసుకొచ్చి మెల్లారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రామ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
గ్రామంలో మద్యం నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరిన సర్పంచ్, అక్రమ బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. యువకులు, మహిళలు స్వచ్ఛమైన ఆలోచనలతో మార్పుకు నాంది పలకాలని సూచించారు.
ప్రతి కుటుంబం గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
