విద్యార్థుల విద్యా సామర్థ్యాల పరిశీలన
— జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
రామారెడ్డి జనవరి 02 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.తరగతి గదిలో విద్యార్థులతో బోర్డుపై గణితశాస్త్ర లెక్కలు వ్రాయించి, వారి విద్యా స్థాయిని స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థిని నీ అభినందించారు.విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి, తరగతి గదుల్లో విద్యార్థులతో పరస్పర చర్చ జరిపి, బోధనా ప్రక్రియను గమనించారు. బోర్డుపై ప్రశ్నలు వ్రాయించి విద్యార్థులతో సమాధానాలు చెప్పిస్తూ వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు.విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని చదవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.ఇందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారి లోపాలను గుర్తించి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసే విధంగా బోధన సాగించాలని, పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.అలాగే స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డిఓ వీణ, డీఈవో రాజు, తహసిల్దార్ ఉమలత, ఎంఈఓ ఆనందరావు తదితరులు ఉన్నారు.
