ప్రమాదాల నివారణకు ఇక ఆ ప్రాంతాల్లో ఎరుపు రంగు రోడ్లు

V. Sai Krishna Reddy
1 Min Read

అటవీ ప్రాంతాల్లో రోడ్లపై తరుచూ ప్రమాదాలు జరిగి వన్యప్రాణాలు మృత్యువాత పడకుండా ఉండేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) వినూత్న ఆలోచన చేసింది. ఇందుకోసం సెన్సిటివ్ జోన్‌లలో రోడ్లపై చతురస్త్రాకారంలో ఎర్రని రంగుతో మార్కింగ్ చేస్తారు. ఈ రోడ్డు నలుపు, ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇప్పటికే జబల్‌పూర్-భోపాల్ జాతీయ రహదారిలో ఇలాంటి రోడ్డు కనిపిస్తోంది.

నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం మీదుగా వెళ్లే రహదారిలో ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్ఏఐ రోడ్డుపై ఎరుపు రంగుతో పెయింట్ వేసింది. ఈ రోడ్డు 12 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇంతకుముందు ఈ రోడ్డు రెండు లైన్లుగా ఉండగా, ఎన్‌హెచ్ఏఐ ఇప్పుడు దీనిని నాలుగు లైన్లుగా మార్చింది. వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *