– రైతు సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా
– 24 గంటలు అందుబాటులో ఉండే గ్రామాభివృద్ధి దిశగా పనిచేస్తా
– గ్రామపంచాయతీలో ఇలాంటి అవినీతి కి తావు లేకుండా కృషి చేస్తా
– ప్రజలు మరియు యువత అభిప్రాయల సేకరణ
– యువతకు స్థానిక పరిశ్రమలలో 75% ఉద్యోగ అవకాశాలకై కృషి
భిక్కనూరు, డిసెంబర్ 9 (ప్రజాజ్యోతి)
భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన వేలిముద్ర జాల సత్యం ఉంగరం గుర్తుతో సర్పంచ్ బరిలో షబ్బీర్ అలీ ఆశీర్వాదాలతో.. కాంగ్రెస్ అధ్యక్షురాలకు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా, పార్టీ ఆదేశాల అనుసారం గ్రామ అభివృద్ధిలో సాగిపోతానని తెలిపాడు.
గ్రామం కోసం కన్న కలలు
1 గ్రామంలో కల్యాణ మండప నిర్మాణం
2 ప్రతి కళ్యాణం లో తులం నర వెండితో పాటు 50 కిలోల సన్న బియ్యం
3 పెన్షన్ మంజూరు కానీ పదిమందికి ప్రభుత్వ పెన్షన్ వచ్చేదాకా సొంత డబ్బులతో 1000 రూపాయల పెన్షన్ ఇస్తానని
4 పేద, మధ్య తరగతి వారిపై ప్రత్యేక దృష్టి
గెలిచినా, ఓడిన గ్రామం కోసం కన్న కలలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని,తన సొంత మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షిస్తూ, భిన్నమైన ఆలోచనలతో గ్రామ అభివృద్ధిలో భాగం అవ్వడం కోసం ఇంటింటి ప్రచారంలో గ్రామస్తుల ఆశీర్వాదంతో దూసుకుపోతున్నాడు.
