- మరిపెడలో ఘోర రోడ్డు ప్రమాదం
- యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మరిపెడ, నవంబర్9 (ప్రజాజ్యోతి):
మహబూబాబాద్ జిల్లా మరిపెడమండలంలోని బురహానుపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై ఆదివారం సాయంత్రం జరిగినరోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగంగా వచ్చిన బైక్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం ఇటిక్యాల పల్లి గ్రామానికి చెందిన శివరాత్రి చందు (25) మరియు ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన రాము బురహానుపురం గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చుట్టాల ఇంటికి వచ్చారు. సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై మరిపెడ మండల కేంద్రానికి బయలుదేరారు.ఈ క్రమంలో అతివేగంతో వస్తున్న బైక్ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో శివరాత్రి చందు అక్కడికక్కడే మృతి చెందగా,రాము చేయి విరిగి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. స్థానికులసమాచారంతో 108 అంబులెన్స్‌లో గాయపడిన రామును మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం బైక్‌పై వస్తున్న యువకులు మద్యం సేవించి రాష్ డ్రైవింగ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం.మరిపెడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
