- శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
నల్లబెల్లి/నవంబర్ 5 ( ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అశేష భక్తజన సందోహంలో విశేష భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన పూజారి పెందోట మురళీమోహన్ చారి, పూజారి రాంప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక, అలంకార, అర్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉసిరి దీపాలతో స్వామివారికి దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశదీప దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ పవిత్ర సమయంలో ఆకాశదీప దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గందె శ్రీనివాస్ గుప్తా, ధర్మకర్త తాటిపెల్లి రవీందర్. పురాం బద్రీనాథ్, మార్తా మార్కండేయ. పాండవుల రాంబాబు, మిట్టగడుపుల సాక్షి సాంబయ్య, ముత్యాల కుమారస్వామి, ఉడత వీరన్న తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

