- మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు.. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తహసిల్దార్ ముప్పు కృష్ణ.
నల్లబెల్లి/ అక్టోబర్ 29 (ప్రజా జ్యోతి):
నల్లబెల్లి మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి తహసిల్దార్ ముప్పు కృష్ణ సూచించారు. బుధవారం ప్రకటన ద్వారా వారు మాట్లాడుతూ.. కరెంట్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను తాకకుండా జాగ్రత్త పడాలన్నారు. మ్యాన్‌హోల్స్. డ్రైనేజీల ను గమనించి పక్కన నడవాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు వ్యవసాయ ఇతర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని. పాత గోడలు పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుందని, అదే క్రమంలో ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్ప తప్పని పరిస్థితులలో మాత్రమే బయటకు వెళ్లాలని తల్లిదండ్రులు పిల్లలను రోడ్లపైకి రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
