బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. ఈ వార్తతో హరీశ్‌రావు కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్… హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. తన బావ అయిన సత్యనారాయణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
