- నయీంనగర్ తేజస్వీ స్కూల్ లో మరో విద్యార్థి మృతి
వరంగల్ / ప్రజాజ్యోతి::
హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీంనగర్ తేజస్వీ స్కూల్ లో మరో విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. నాలుగవ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ (9) అనే నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ కు రోజువారీ మాదిరిగా వచ్చిన విద్యార్థి ఒక్కసారిగా కుప్ప కూలటంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర తలనొప్పి కారణంతో ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెప్పారు. స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేశారు. గేటుకు తాళంవేసి యాజమాన్యం పరారైనట్టు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. బాలుడిది హనుమకొండ గుండ్లసింగారం. నెల రోజుల కిందటే ఇదే పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.