- గాంధీ జయంతి…. డోంట్ కేర్
- గాంధీ జయంతి రోజున దగ్గరుండి జంతు బలి చేయించిన నర్సంపేట సీఐ..
నర్సంపేట/ప్రజాజ్యోతి::
దసరా ఉత్సవాల సందర్భంగా జంతు బలి కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయం కానీ గాంధీ జయంతి రోజు జంతు బలి అనిది దేశ వ్యాప్తంగా నిషేధం. జంతువులను బలి చేయడం మాంసాన్ని విక్రయించడం నేరం. చట్టాలు స్పష్టంగా చెప్పినప్పటికీ నర్సంపేట పట్టణ సిఐ మాత్రం అందుకు విరుద్ధంగా దగ్గరుండి జంతుబలి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇప్పుడు చర్చగా మారింది.
నర్సంపేట ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. విచారణ కొనసాగుతోందన్నారు. నర్సంపేటలో గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. కాగా గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా.. పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.