ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. “తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి” అని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’, రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు