- రాబోయే స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలి
- తెలంగాణ ముదిరాజ్ మహాసభ యూత్ ప్రధాన కార్యదర్శి బండి సతీష్ ముదిరాజ్
దామెర, అక్టోబర్ 01 (ప్రజాజ్యోతి):
బీసీ వర్గంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాముఖ్యత నివ్వాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యూత్ ప్రధాన కార్యదర్శి బండి సతీష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. యువత ఆయా రాజకీయ పార్టీల జెండాలు మోయకుండా రాజకీయ చైతన్యంతో ముందుకు వచ్చి పోటీల్లో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సంకెళ్ళ సంపత్, సాదు చంద్రమౌళి, సాదు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు