ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి తిరిగి వరద ప్రవాహం మొదలైంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి అధిక మొత్తంలో వరద నీరు వస్తుండటంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి (సోమవారం ఉదయానికి) ప్రాజెక్టులోకి 2,69,429 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా, 3,48,492 క్యూసెక్కులుగా ఔట్‌ఫ్లో నమోదైంది.
అధికారులు తెలిపిన నీటి విడుదల వివరాలు:
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30,000 క్యూసెక్కులు
ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు
కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,311 క్యూసెక్కులు
స్పిల్‌వే గేట్లు (10) ద్వారా 2,52,866 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత పరిస్థితి:
నీటిమట్టం: 883.50 అడుగులు (పూర్తి స్థాయి – 885 అడుగులు)
నీటి నిల్వ సామర్థ్యం: 215.81 టీఎంసీలు
ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు: 207.41 టీఎంసీలు