సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి):ప్రతి ఒక్కరు సేవాభావాన్ని కలిగి ఉండాలని అభయ సేవాసమితి సభ్యులు అన్నారు. ఆదివారం మహాలయ పక్ష అమావాస్య తిధి సందర్భంగా పట్టణంలోని అలంకార్ థియేటర్ రోడ్డులో అభయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు.అన్నదానంతో ఆకలి తీర్చడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి సురేష్, తోట శ్యాంప్రసాద్, గుండా శంకర్, వీర్లపాటి రమేష్, ఏకాంబరం, బి.శ్రీనివాస్, రంగనాథ్, వెంకన్న, వెంకటేశ్వర్లు, సురేష్, రమేష్, ఉపేందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.