‘జీఏటీఈఎస్’ అమెరికా సహకారంతో మానసిక వికలాంగుల అవసరాలకు రేకుల షెడ్డు నిర్మాణం..

Warangal Bureau
1 Min Read
  • మానసిక వికలాంగుల అవసరాలకు రేకుల షెడ్డు నిర్మాణం

  • జీఏటీఈఎస్ అమెరికా సహకారం

హనుమకొండ, సెప్టెంబర్ 20 (ప్రజాజ్యోతి):

సమాజానికి ఉపయోగపడే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేటర్ అట్లాంట తెలంగాణ సొసైటీ (జీ ఏ టీ ఈ ఎస్) అమెరికా వారి సౌజన్యంతో నవ్య శ్రీ మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులు (ఐడి ) గల పిల్లల కోసం రేకుల షెడ్డు నిర్మాణ చేసి సంస్థ వారు సహాయం అందించారు. జీ ఏ టీ ఈ ఎస్ టీం సహకారంతో నూతన షెడ్డు నిర్మించబడింది. ముఖ్య అతిథి డాక్టర్ బత్తిని జీవన్ – ప్రవళిక చేతుల మీదుగా రేకుల షెడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా నవ్య శ్రీ మనో వికాస కేంద్రం ప్రెసిడెంట్ కందకట్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల విద్యార్థుల అవసరాల కోసం షెడ్డు నిర్మాణానికి సహకరించిన జీ ఏ టీ ఈ ఎస్ టీం, డాక్టర్ జీవన్ బత్తిని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డేగరాజు, నాగరాజు, మాధవి, చైతన్య, సుశ్మిత, భారతి, సునీత తదితర సిబ్బంది పాల్గొన్నారు.

 

Mahender Reddy Kariveda 

9949810788
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *