* అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
* కాలేశ్వరం ఏఈఈ దివ్య,ఉదయ్
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండల పరిధిలోని మహమ్మదాబాద్, జక్కపల్లి(గ్రామ శివారు) సరిహద్దు ప్రాంతం కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 19 నుండి” ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ తవ్వకాలు” అనే శీర్షికతో ఆదివారం ’ప్రజాజ్యోతి దినపత్రికలో’ ప్రచరితమైన కథనానికి సంబంధిత కాలేశ్వరం అధికారులు స్పందించారు. ప్యాకేజ్ 19 ఏఈఈ దివ్య, ఉదయ్, అక్రమ తవ్వకాలు చేపట్టిన స్థలాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పేరిట అనుమతులు లేకుండా తవ్వకాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 18,19 నుండి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేస్తామని, పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి వెంట సంబంధిత అధికారులు ఆశ్రా, మంజులత, తదితరులు ఉన్నారు.
