ఆత్మకూరు / ప్రజాజ్యోతి :
‘ఇనుగాల చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఎం జి ఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్త సేకరణ చేశారు. ఇనుగాల చారిటబుల్ ట్రస్ట్ 12 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్బంగా మరియు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి పుట్టిన రోజు పురష్కరించుకొని మెగా రక్త దాన శిబిరం తో పాటు శరత్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 300 యూనిట్ల వరకు రక్తం సేకరించారు. ఇంకా సేకరణ కొనసాగుతుంది. సుమారు వెయ్యి మంది వరకు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారని, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ రోజు సేకరించిన రక్తం ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగ పడుతుందన్నారు. రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల ప్రమాద భీమా అందిస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తలకు సుమారు రెండు వేల మందికి భోజన వసతి కల్పించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇనుగాల వెంకట్రాంరెడ్డి ని శాలువాలతో సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

💐💐

**

