వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలంగాణ, ఏపీలలోని పలు జిల్లాల్లో వర్షాలు
వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
					