మెదక్ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగిపోవడంతో రవాణా వ్యవస్థ కూడా అక్కడక్కడ దెబ్బతింది. గ్రామాలలోని పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా విద్యా శాఖ అధికారి రాధా కిషన్ ప్రకటన ప్రకారం రేపు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
