నూతన నియామకం
కరీంనగర్ జిల్లా బీసీ యువజన సంఘం సంయుక్త కార్యదర్శిగా నరాల శ్రీకాంత్
కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 27, (ప్రజాజ్యోతి)
బీసీ యువజన సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా నరాల శ్రీకాంత్ నియమితులయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ డా. అరుణ్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి సూచనతో జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ హక్కుల సాధనకై, సంఘ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు.