అసలేమిటీ ‘ఫ్లిప్ కార్ట్ బ్లాక్’… వివరాలు ఇవిగో!

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన కొత్త ప్రీమియం సభ్యత్వ సర్వీసు ‘ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌’ను అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు, సేల్‌ ఈవెంట్లకు ముందస్తు యాక్సెస్‌, ప్రాధాన్య కస్టమర్‌ సేవలు వంటి అనేక ప్రయోజనాలను ఈ సబ్‌స్క్రిప్షన్‌ అందించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ సభ్యులకు ఏడాది పాటు రూ.1,490 విలువైన యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనుంది. ఈ సదుపాయం ఒక్క యూట్యూబ్‌ ఖాతాకే వర్తిస్తుంది. వేరే ఖాతాకు బదిలీ చేయలేరు.

ఫీజు మరియు ఆఫర్లు:

వార్షిక ఫీజు: రూ.1,499
పరిమితకాల ఆఫర్‌ ధర: రూ.990
ప్రతీ ఆర్డర్‌పై గరిష్ఠంగా రూ.100 వరకూ 5 శాతం సూపర్‌కాయిన్స్ క్యాష్‌బ్యాక్
నెలకు గరిష్ఠంగా 800 సూపర్‌కాయిన్స్‌ పొందే అవకాశం
సూపర్‌కాయిన్స్‌తో చేసే చెల్లింపులపై రూ.1,000 వరకూ అదనంగా 5 శాతం రాయితీ
సూపర్‌కాయిన్స్‌ అనేవి ఫ్లిప్‌కార్ట్‌ రివార్డ్‌ కరెన్సీ. ఒక్క కాయిన్‌ విలువ ఒక్క రూపాయి.

ఇతర ఫ్లిప్‌కార్ట్‌ సభ్యత్వాలు:

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌: 10 ఆర్డర్లతో ప్లస్‌ సిల్వర్‌, 20 ఆర్డర్లతో ప్లస్‌ గోల్డ్‌
వీఐపీ మెంబర్‌షిప్‌: రూ.799కి అందుబాటులో ఉంది

ఈ కొత్త సర్వీసును అమెజాన్‌ ప్రైమ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ వర్గాలు తెలిపాయి. వినియోగదారులకు మరింత విలువను అందించే దిశగా ఈ ప్లాన్‌ ను రూపొందించినట్లు వెల్లడించాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *