డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 15 మందికి జైలు శిక్ష

Kamareddy
0 Min Read

ఎస్. ఐ ఆంజనేయులు

గాంధారి ఆగష్టు 22(ప్రజాజ్యోతి)

గాంధారి మండల పరిధిలో జరిగిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మందిపై కఠిన చర్యలు తీసుకున్నారు.ఎల్లారెడ్డి జేఎఫ్‌సిఎం న్యాయమూర్తి ఎం. సుష్మ 15 మందికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు ₹1100/- జరిమానా విధించారు.శిక్షపడినవారు కాట్రోత్ రమేష్, కుమ్మరి సాయిలు, బానోత్ గణేష్, తదితరులు ఉన్నారు అని గాంధారి ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *