రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన ‘కూలీ’, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటికి చాలా రోజుల ముందు నుంచి కూడా థియేటర్ల దగ్గర సందడి తగ్గింది. అలాంటి సమయంలో ఈ సినిమా మళ్లీ ఒక్కసారిగా థియేటర్లను నింపింది. అన్ని ప్రాంతాలలోని థియేటర్లు కళకళలాడాయి. తొలి రోజు నుంచే ఈ సినిమా తన రికార్డుల వేట మొదలుపెట్టింది.
తొలి వారంలో ఈ సినిమా 444 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడివరకూ ఉన్న రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ సినిమా 460 కోట్ల మార్క్ ను టచ్ చేస్తే మరి కొన్ని రికార్డులు పక్కకి తప్పుకుంటాయని చెబుతున్నారు. త్వరలోనే 500 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. తొలి మూడు రోజులలోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అదే ఊపు కొనసాగి ఉంటే, ఈ పాటికే ఆ మార్క్ ను అందుకుని ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాట అతధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల జాబితాలో రజనీకాంత్ నటించిన ‘2.0’ .. ‘జైలర్’ ఉన్నాయి. ప్రస్తుతానికి ‘కూలీ’ టాప్ 6 ప్లేస్ కి వచ్చి చేరింది. త్వరలోనే టాప్ 5లో జాయిన్ కావొచ్చని అంటున్నారు. రజనీ ఫ్యాన్స్ ఒక వైపున కూలీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, మరో వైపున ‘జైలర్ 2’ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మరో వైపున రజనీ – కమల్ కలిసి సినిమా చేయవచ్చనే ప్రచారం కూడా కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఇంతకాలంగా రజనీ – కమల్ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేస్తారేమో చూడాలి.