విఠనేశ్వర,శివాలయం భూముల హద్దులు
రామారెడ్డి ఆగస్టు 12 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండలం రంగంపేట గ్రామంలో విఠలేశ్వర స్వామి దేవాలయం, శివాలయం పేరు పై గల భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. రంగంపేట గ్రామంలో గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆశిస్ సంఘ్వాన్ ఆదేశానుసారం రంగంపేట గ్రామస్తులు దేవాలయ భూమిని హద్దులు చూపించాలని కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడం జరిగింది. మండల అధికారులు భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఆర్ఐ. రవికాంత్, మండల సర్వేయర్, సిబ్బంది రంగంపేట గ్రామస్తులు విడిసి అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు మగ్గిడి శ్యామ్ వీడీసీ సభ్యులు సురేందర్ సింగ్, పిట్టల అశోక్ సాకలియవాన్ సంజయ్ సింగ్ ఎంకంపల్లి మల్లేష్ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.