సూర్యాపేట జిల్లాలో అత్యాధునిక సాంసంగ్ వీ8 అల్ట్రా సౌండ్ మిషన్ తో తాము అందించే స్కానింగ్ సేవలను సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఐశ్వర్య స్కానింగ్ సెంటర్ డాక్టర్ కె.ఐశ్వర్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోడ్డు నెంబర్ వన్ లో డాక్టర్ కె.ఐశ్వర్య ఎంబిబిఎస్ ఎండీ రేడియాలజీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య స్కానింగ్ సెంటర్ ను డాక్టర్ రాజ్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల వైద్య పరిస్థితులను నిర్ధారించడానికి, చికిత్స ప్రణాళికను రూపొందించడానికి స్కానింగ్ సహాయపడుతుందని అన్నారు.తమ స్కానింగ్ సెంటర్ లో అన్ని రకాల అల్ట్రా సౌండ్ స్కానింగ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు.సూర్యాపేటలో అత్యాధునిక సాంసంగ్ వీ8 అల్ట్రా సౌండ్ మిషన్ తో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా తాము నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య స్కానింగ్ సెంటర్ ను ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్ గౌడ్, కుక్కడపు శ్రీనివాస్, మానసాని రామ్మూర్తి, మేనేజ్మెంట్ మానుపురి సాయి కుమార్,పులి అచ్యుత రామశర్మ, పులి రోహిత్ శర్మ, శివ, పూజ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.