ఉజ్వలా గ్యాస్ తో, భారత్ కి ఉజ్వల భవిష్యత్తు
రామారెడ్డి ఆగష్టు 02 (ప్రజా జ్యోతి)
బిజెపి యువమోర్చా కామారెడ్డి జిల్లా కార్యదర్శి, సిఆర్ఓ భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇసాయిపేట నరేష్ మాట్లాడుతూ ఉజ్వలా గ్యాస్ తో, భారత్ కి ఉజ్వల భవిష్యత్తు.పొగబారిన బతుకులలో వెలుగులు నింపిన మోదీదారిద్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల జీవితాన్ని సుఖమయం చేసేందుకు, వారి ఆరోగ్యాన్ని కాపా డడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం 2016 మే 1న కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘పీఎం ఉజ్వల యోజన’ను ప్రవేశపెట్టింది. 2019 సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా ఇండ్లకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.కేవలం ఏడు నెలల లోనే ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి దేశంలో ఎనిమిది కోట్లకు పైగా ఆడబిడ్డలను కట్టెల పొయ్యి, పొగ నుంచి విముక్తి చేశారు.గతంలో కట్టెల పొయ్యి పై వంట చేసి అష్ట అష్ట కష్టాలు పడుతూ మహిళలు సగం రోజు వంట గదిలోనే గడిపేవారు.ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల కట్టెల పొగను, కష్టాలను దూరం చేసారు. గతంలో కట్టెల, బొగ్గు, పిడకల పొయ్యిలతో వంట చేయడంతో వచ్చే పొగతో దేశవ్యాప్తంగా యేటా సుమారు ఐదు లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెప్పింది. అందులో ఎక్కువ గా మహిళలే ఉండేవారు.ఇటీవల దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజనతో మహిళలకు శ్వాసకోశ,ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు 28 శాతం తగినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇండియన్ టెస్ట్ సొసైటీ, టెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ మధ్యకాలంలో నివేదికలు వెల్లడించింది.గతంలో ప్రతి ఎంపీకి 25 కూపన్లు,గతంలో ఎంపీకి యేటా 25 గ్యాస్ కనెక్షన్ కూపన్లు ప్ర భుత్వము ఇచ్చేది. వారు తమ పార్లమెంట్ పరిధిలో 25 కూపన్లు 25 కుటుంబాలకు ఇవ్వడమే గర్వంగా భావించే వారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం పదేండ్లు 2014 వరకు దేశంలో కేవలం 13 కోట్ల మందికే గ్యాస్ కనెక్షన్లు ఉండేవి, ప్రధానమంత్రి సరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తరువాత పీఎం ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 ద్వారా రేషన్ కార్డు ఉండి 18 యేండ్లు నిండిన మహిళల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో, గత పదేండ్లలో దేశవ్యాప్తంగా 12 కోట్ల కు టుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు.ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల మందికి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి వారి పొగ బారిన బతుకులలో ప్రధాని మోడీ వెలుగులు నింపారు. దీంతో మహిళలకు వంట సమయం ఆదా చేయడంతో స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆదాయం పెరుగుతుంది.మన దేశంలో అమలు చేస్తున్న ఉజ్వల యోజన యోజన పథకాన్ని ఘన, బంగ్లాదేశ్ లాంటి ఆగ్రా దేశాలు మన దేశంలో అధ్యయనం చేసి వాళ్ల దేశంలో కూడా మనలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావించాయి. అందువలన ఉజ్వల గ్యాస్ తో భారత్ కి ఉజ్వల భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.