భారత్ లో ఆసక్తికరమైన రేసుకు తెరలేచింది. ఇటీవలే వరల్డ్ ఫేమస్ టెస్లా కంపెనీ భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రారంభించగా, ఇప్పుడు వియత్నాంకు చెందిన దిగ్గజ సంస్థ విన్‌ఫాస్ట్ కూడా రంగప్రవేశం చేసింది.
విన్‌ఫాస్ట్ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. గుజరాత్‌లోని సూరత్‌లో కంపెనీ తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో విన్‌ఫాస్ట్ యొక్క ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వేరియంట్లైన వీఎఫ్ 6 మరియు వీఎఫ్ 7 లను ప్రదర్శించింది. ఈ రెండు మోడళ్లకు జూలై 15 నుంచి రూ. 21,000 పూర్తి రిఫండబుల్ డిపాజిట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
విన్‌ఫాస్ట్ భారత్ ను తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి వ్యూహాత్మక మార్కెట్‌గా మరియు భవిష్యత్ హబ్‌గా భావిస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే తమ ప్లాంట్‌లో వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను తెరవాలని విన్‌ఫాస్ట్ యోచిస్తోంది.
కస్టమర్లకు ఛార్జింగ్ మరియు ఆఫ్టర్‌సేల్స్ సేవలను అందించడానికి విన్‌ఫాస్ట్ రోడ్‌గ్రిడ్, మైటీవీఎస్ మరియు గ్లోబల్ అస్యూర్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్యాటరీ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి బాట్‌ఎక్స్ ఎనర్జీస్‌తో కూడా చేతులు కలిపింది.
విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ, “సూరత్‌లో మొదటి విన్‌ఫాస్ట్ షోరూమ్ భారత్ పట్ల మా నిబద్ధతకు ప్రతీక. భారతీయ వినియోగదారులకు విన్‌ఫాస్ట్ అనుభవాన్ని అందించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము” అని పేర్కొన్నారు.
వీఎఫ్ 6 ఎంట్రీ-లెవల్ 5-సీటర్ ఎస్ యూవీ కాగా, ఇది 59.6kWh బ్యాటరీ ప్యాక్‌తో ఎకో మరియు ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. వీఎఫ్ 7 కూడా 5-సీటర్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్ యూవీ, ఇది 70.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇందులో లెవల్ 2 అడాస్, 12.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.