తెలంగాణ పండరిపూర్ విఠలేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి!
పాండురంగ ఆలయానికి ఎంతమంది భక్తులు వచ్చిన అన్నదానం చేస్తా..
మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్!
బీర్కూర్ బాన్సువాడ జులై 25 ( ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని బైరాపూర్ విట్ఠలేశ్వరాలయానికి పాదయాత్ర గా వచ్చిన జుక్కల్ మండలం లొంగన్ గ్రామానికి చెందిన వార్కారీలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . బైరాపూర్ తెలంగాణ పండర్పూర్గా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు కోరిన కోరికలను కొంగుబంగారంగా తిర్చుతూ విరజల్లుతుందనీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ద్రోణ వల్లి సతీష్ దంపతులు మాట్లాడుతూ పాండురంగ భక్తులు ఎంతమంది వచ్చినా మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.