జూనియర్ ‘ ట్రైలర్ లాంచ్… చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రాజమౌళి

V. Sai Krishna Reddy
1 Min Read

కర్ణాటక రాజకీయ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి టాలీవుడ్ లో వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరీటి సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన గీతం యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం జులై 18న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.

తాజాగా అగ్ర దర్శకుడు రాజమౌళి జూనియర్ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. జూనియర్ చిత్ర బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం కలిగిస్తోందని, ఈ తొలి చిత్రంతో కిరిటీకి విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలిపారు. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ వీడియోను పంచుకున్నారు.

కాగా, వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇందులో కన్నడ సీనియర్ నటుడు వి.రవిచంద్రన్ ఓ కీలకపాత్ర పోఫిస్తుండడం విశేషం. ఇందులో ఇంకా జెనీలియా, రావు రమేశ్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *