జర్నలిస్టులంతా ఒక్కటే
— చిన్న పెద్ద పత్రికలంటూ తేడా లేదు
— మా ఎమ్మెల్యే అండ దండలు అందరి కి వుంటాయి
— పక్షం రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం….లేనిపక్షంలో జర్నలిస్టులకు అండగా దీక్షలో మేము కూర్చుంటాం
– ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , కాంగ్రెస్ ముఖ్య నాయకులు సురేందర్ రెడ్డి ల హామీ
– 17 వ రోజు రిలే దీక్షలు విరమించిన టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు
మహబూబ్ నగర్ జూలై 9 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి )
కాంగ్రెస్ పార్టీ కి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కి జర్నలిస్టులంతా సమానమేనని మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నేత మారేపల్లి సురేందర్ రెడ్డిలు అన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ లో బుధవారం జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం చేస్తున్న రిలే దీక్షల వద్దకు బుధ వారం ఎమ్మెల్యే తరపున కాంగ్రెస్ నాయకులు ముడా చైర్మన్ లక్ష్మణ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు సురేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి సెక్రెటరీ సిరాజ్ కాద్రి దీక్షా శిబిరానికి వచ్చారు. దీక్షలను విరివింపజేసేందుకు శిబిరం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే ప్రతినిధులుగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దీక్షలు విరమింప జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. మా ఎమ్మెల్యే దృష్టిలో చిన్న పెద్ద పత్రికలనే తేడాలు లేవన్నారు. మా ఎమ్మెల్యే అండా దండాలు అందరికి ఉంటాయన్నారు. జర్నలిస్టుల సమస్యలు పక్షం రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో జర్నలిస్టుల కు అండగా ఉండి జర్నలిస్టులు చేసే ఆందోళన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని నమ్మబలికారు. అంతకన్నా ముందు రోజు టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ నాయకులతో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపి జర్నలిస్టుల డిమాండ్లను ఒప్పుకొని పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో జర్నలిస్టుల చర్చలు సఫలం అయ్యాయి. దీంతో జర్నలిస్టుల దీక్షలను విరమింపజేసేందుకు బుధవారం దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యే తరుపున ప్రతినిధులుగా మూడ ఛైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నేత మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్యలు జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు పక్షం రోజుల్లో పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో జరిపిన చర్చలు జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లైన ఇండ్లు ఇండ్లు స్థలాలు లేని జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, మౌలాలి గుట్ట వద్ద పట్టాలు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల తాళాలు ఇస్తామని , కోర్టు కేసులలో ఉన్న ఇరువురిని కూర్చోబెట్టి పరిష్కరిస్తామని, ఎస్వీఎస్ దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టా ఉండి ఇల్లు నిర్మాణం చేయని వారికి ఎన్ఓసి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఇండ్ల విషయంలో రాజకీయం చేసిన వారిపై నిప్పులు చెరిగారు.
గత ప్రభుత్వంలో జర్నలిస్టులు, సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుకోలేని పరిస్థితి స్వేచ్ఛ హరించారని మండిపడ్డారు. నాడు జర్నలిస్టుల మధ్యల చిచ్చుపెట్టి నేడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఉందన్నారు. సురెందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ విచారణలో తాను కూడా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇండ్లు కట్టించి ఇచ్చి, చిన్న పెద్ద పత్రికలంటూ తేడా చూపి జర్నలిస్టుల మధ్య గొడవ పెట్టి ఒకరినొకరు కోట్టు కునెట్టట్లు చేశారన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విదానాలతో నేడు జర్నలిస్టులు రోడ్డున పడేటట్లు చేశారన్నారు. జర్నలిస్టుల సమస్యలు అన్నింటిని వారం పదిహేను రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాలు రాని జర్నలిస్టుల జాబితాలు, ఎస్వీఎస్ గుట్ట దగ్గర ఇల్లు నిర్మాణం చేయని వారికి ఎన్ఓసి పట్టాల కోసం జాబితా, మౌలాలి గుట్ట వద్ద పట్టాలు పొంది తాళం చేతులు రాని వారి జాబితాను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, ఫౌండర్ మంగళగిరి యాదగిరి,
జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వరరావు, మొయిజు , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎండి రఫీ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పసుపుల శ్రీనివాస్, నాయకులు , రమాకాంత్ రెడ్డి , కటిక రవీందర్, సతీష్, కుమార్, సుందర చారి, ఎంవి వెంకటరమణ, ఆనంద్, రాఘవేందర్, నిరంజన్, రవి, మిట్టమీది బాలరాజ్ , జగదీష్, అప్రోజు, ఖాజా , కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.