*ఘనంగా ఏబీవీపీ 77వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు.*సిద్దిపేట.*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో 77వ జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక వీర సావర్కర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి.*రాష్ట్ర SFD కన్వినర్ సుర్వి మణికంఠ గారు పాల్గొన్నారు*. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే విద్యార్థుల కోసం జాతీయవాదం కోసం పనిచేస్తున్న ఏకైక అతిపెద్ద విద్యార్థు సంఘం ఏబీవీపీ అని,దేశంలో జాతీయ భావాలు విద్యార్థుల్లో నింపాలని మరియు అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంస్థ ఏబీవీపీ అని అన్నారు.జులై 9 1949 ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులు మరియు ప్రొఫెసర్ తో ప్రారంభమైన విద్యార్థి సంఘం ఈరోజుతో 56 లక్షల మెంబర్షిప్ తో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా కొనసాగుతుంది.జాతీయ జెండా కోసం ఈ దేశం కోసం ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలకు వెనకాడకుండా దేశం కోసం ధర్మం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని వారు అన్నారు. జాతీయస్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు ఎక్కడ ఏ సమస్య ఉన్న అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కూడా నా రక్తం నా తెలంగాణ అనే పేరుతో 20వేల యూనిట్ల రక్తదానం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని మరియు అలాగే తెలంగాణ రణభేరి పేరు మీద విద్యార్థులందర్ని తెలంగాణ రాష్ట్రం కోసం ఏకం చేసిందని అన్నారు.వివేకానందుని మాట ఏబీవీపీ బాట మన ఉద్దేశంతో విద్యార్థులని సత్ప్రవర్తన దేశభక్తి వైపు మలుపుతున్న విద్యార్థి సంఘం ఏబీవీపీ అనిఅన్నారు.విద్యార్థులందరికీ వారు 77వ జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే స్వామి వివేకానంద అంబేద్కర్ భగత్ సింగ్ కలలుగన్న ఆశయాల కోసం ఏబీవీపీ పని చేస్తుంది అన్నారు,ఈ దేశం కోసం జాతీయత కోసం పోరాడిన భరతమాత బిడ్డలని ఏబీవీపీ ఎప్పుడు స్మరించుకొని వారి స్ఫూర్తితో విద్యార్థుల్లో దేశభక్తి జాతీయభావన నింపడానికి ఏబీవీపీ ఎల్లప్పుడు పనిచేస్తుందని అన్నారు. స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్, అగ్రివిసన్ కన్వీనర్ మానస, నగర కార్యదర్శి పరశురాం, జోనల్ ఇన్చార్జులు భాను,అనిష్ నగర ఉపాధ్యక్షులు వసంత్ లోకేష్, సంయుక్త కార్యదర్శులు ధర్మతేజ, వివేక్,శ్రీనివాస్. కార్యవర్గ సభ్యులు రోహిత్, ఉదయ్,భాను మధు,చరణ్,తేజ,మనిచరణ్ పూర్వ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు